హైదరాబాద్, వెలుగు: నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్న ప్రైవేట్హాస్పిటళ్లను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి హెచ్చరించారు. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పరిధిలోని ప్రైవేట్హాస్పిటళ్ల యజమానులు, డైరెక్టర్లతో శుక్రవారం మినిస్టర్ రోడ్లోని కిమ్స్హాస్పిటల్ లో ఓరియెంటేషన్ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ వెంకటి మాట్లాడుతూ.. ప్రతి హాస్పిటల్తప్పనిసరిగా రిజిస్ట్రేషన్, రెన్యువల్ చేసుకోవాలని, లేకుంటే పెనాల్టీ వసూలు చేస్తామని హెచ్చరించారు. చికిత్సకు సంబంధించిన రేట్ల వివరాలను అందరికీ కనిపించేలా డిస్ప్లే చేయాలని, జూన్లో డిస్ట్రిక్ట్హెల్త్ఆఫీసులో వివరాలు అందచేయాలని చెప్పారు. అన్ని హాస్పిటళ్లు ఆయుష్మాన్భారత్లో రిజిస్టర్చేసుకోవాలని సూచించారు. లెవెల్ వన్ సర్టిఫికెట్పొందిన తర్వాతనే డాక్టర్లు సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. డిస్ట్రిక్ట్ అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జయమాలిని, డాక్టర్లు నిర్మలా ప్రభావతి, అశ్రితారెడ్డి, కల్పన, హర్ష, మినాజ్జాఫర్, డాక్టర్ కిషన్ రావు పాల్గొన్నారు.
