
తాండూరు, వెలుగు: రైతులు విత్తనాలను గుర్తించిన డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్ కుమార్ సూచించారు. బుధవారం తాండూరులో జిల్లా ఇంటర్నల్ స్క్వాడ్ అధికారులు, వికారాబాద్ వ్యవసాయ శాఖ ఏడీఏ వినోద్ కుమార్, తాండూరు ఏడీఏ రుద్రమూర్తి టీమ్ తనిఖీలు చేపట్టింది. టౌన్ లో రవిరాజ్ ఫర్టిలైజర్, కావేరీ, సాయిరాం, హనుమాన్, మన గ్రోమోర్ ఫర్టిలైజర్ షాపులతో పాటు ట్రాన్స్ పోర్టుల్లో రికార్డులను, ధరల పట్టికలను తనిఖీ చేశారు.
ధరల పట్టికలను బోర్డులపై రాసి ఉంచాలని వ్యాపారులకు అధికారులు సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు రసీదులు అందించాలని స్పష్టంచేశారు. నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు అమ్మితే చర్యలు కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తాండూరు వ్యవసాయ అధికారిణి రజిత, సిబ్బంది ఉన్నారు.