
- ప్లాన్ వచ్చాకే వసతులవివరాలు తెలుస్తయ్
- హైకోర్టుకు ఆర్ అండ్ బిఈఎన్ సీ వివరణ
హైదరాబాద్, వెలుగు: గీత కార్మికుల సొసైటీలకు రూ. 7,98,99,372 పన్ను బకాయిలు రద్దు చేశామని, దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలైందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. బకాయిల రద్దు వల్ల 4366 టీసీఎస్(టాడీ ట్యాపర్స్ కోఆపరేటివ్ సొసైటీస్), 3709 టీఎఫ్‌టీల సభ్యులు, 2.20 లక్షల మంది గీత వృత్తిదారులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. శుక్రవారం సెక్రటేరియెట్‌లో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేష్ కుమార్‌తో కలిసి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో కుల, చేతి వృత్తులు కనుమరుగయ్యాయని ఆయన ఆరోపించారు. ఎన్నో జీవోలు తెచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక తాటి కల్లు దుకాణాలు ప్రారంభించామని తెలిపారు. గీత కార్మికులు చనిపోతే రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నామన్నారు. గతంలో లైసెన్స్ పేరుతో వేధించేవారని, కానీ తమ ప్రభుత్వం ఒకసారి లైసెన్స్ తీసుకుంటే 10 ఏళ్ల దాకా అవసరం లేకుండా చేస్తోందన్నారు. తాము చెట్టు పన్ను కూడా లేకుండా చేశామని, గీత కార్మికులకు 2000 పెన్షన్ కూడా ఇస్తున్నామని వివరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈత, తాటి చెట్లు నరికేస్తుండటంతో ఆ చెట్లు కనుమరుగు అవుతున్నాయన్నారు. చెట్లు కొడితే ఫొటో తీసి పంపించాలని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కేంద్రం పైసా ఇయ్యకున్నా కాళేశ్వరం కట్టినం
కేంద్రం ఒక్క పైసా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించి, 50 లక్షల ఎకరాలకు నీరందిస్తున్నామని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాలు కలిసి పని చేస్తుంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, ఆయనకు ఏం చెప్పినా అర్థం కాదని దుయ్యబట్టారు. పోలవరం కోసం నిధులిచ్చినా నిర్మించలేకపోయారని విమర్శించారు. బీజేపీ సెంటిమెంట్‌నే నమ్ముకుందని, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం సరికాదన్నారు. గతంలో కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించారని గుర్తు చేశారు. రైతుబంధు పేరు మార్చుకుని కేంద్రం రైతులకు ఆర్థికసాయం చేసిందన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.