లోకల్ ఎలక్షన్లకు పటిష్ట కార్యాచరణ : వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

లోకల్ ఎలక్షన్లకు పటిష్ట కార్యాచరణ : వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్ సుధీర్​, డీపీవో జయసుధతో కలిసి మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని 594 గ్రామపంచాయతీలకు 5,058 వార్డుల్లో పోలింగ్​ నిర్వహించనున్నట్లు తెలిపారు. 20 జడ్పీటీసీ, 227 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. 

జిల్లాలో 4 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, 4 రిసెప్షన్ సెంటర్లు, 3 స్ట్రాంగ్ రూములు, 3 కౌంటింగ్  సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 12 జిల్లా నోడల్ అధికారులు, 105 మంది జోనల్ స్థాయి అధికారులు, 45 ఫ్లయింగ్ స్క్వాడ్​ టీంలు, 59 సిట్టింగ్ స్క్వాడ్​ టీంలు, 20 ఎంసీసీ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్షచౌదరి పాల్గొన్నారు. అలాగే రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకకు ఎన్నికల విధులపై ఇచ్చిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్​ పాల్గొన్నారు