శంషాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత

శంషాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత

రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా హైదరాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అణువణువూ తనిఖీ చేస్తున్నారు. వాహనాలను కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తున్నారు. పర్యాటకులకు పాస్ ల జారీని నిలిపివేశారు. ప్రయాణికులు కూడా తప్పనిసరిగా తగిన గుర్తింపు పత్రాలతో రావాలని భద్రతా అధికారులు సూచించారు. ఈనెల 31వ తేదీ వరకు విమానాశ్రయంపై నిఘా కొనసాగుతుందని… అప్పటి వరకు సందర్శకులకు పాస్ లు కూడా ఇచ్చేది లేదని అధికారులు స్పష్టం చేశారు.