ఢిల్లీలో దంచి కొట్టిన వాన

ఢిల్లీలో దంచి కొట్టిన వాన

దేశ రాజధాని ఢిల్లీలో వాన దంచి కొట్టింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో గాలులకు చెట్లు నేలకూలాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం వేళ కావడంతో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. సోమవారం తెల్లవారుజాము నుంచే ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. వర్షం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విమానాల సమాచారం గురించి ప్రయాణీకులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులతో టచ్ లో ఉండాల్సిందిగా కోరారు.

వర్షంతో పాటు భారీగా గాలులు వీస్తుండడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని జెట్ ఎయిర్ వేస్ వెల్లడిస్తోంది. గత కొద్ది రోజులుగా ఎండలతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో ఊపిరిపీల్చుకుంటున్నారు. వాతావరణం అనుకూలించకపోతుండడంతో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఉదయం వేళ ఆఫీసులకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ - NCR ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. 
 

మరిన్ని వార్తల కోసం : -

సెకండ్ హ్యాండ్ సైకిల్‌‌ కొన్న తండ్రి.. కొడుకు రియాక్షన్, వైరల్ వీడియో

ఆధ్యాత్మిక నిలయాలు స్టార్టప్ లకు స్ఫూర్తినివ్వాలి