సెకండ్ హ్యాండ్ సైకిల్‌‌ కొన్న తండ్రి.. కొడుకు రియాక్షన్, వైరల్ వీడియో

సెకండ్ హ్యాండ్ సైకిల్‌‌ కొన్న తండ్రి.. కొడుకు రియాక్షన్,  వైరల్ వీడియో

పేదోడు కొన్న చిన్న వస్తువుకే సంతోష పడిపోతుంటాడు. ఎందుకంటే.. ఎంతో కష్టపడి వాటిని కొనుక్కుంటాడు. దానిని అపురూపంగా చూసుకుంటాడు. ఓ తండ్రి కొన్న సైకిల్ చూసి.. అతని కొడుకు ఆనందం పట్టలేక గంతులు వేస్తూ.. మురిసిపోయాడు. అది మరీ కొత్త సైకిల్ ఏం కాదు. అయినా.. అతనిలో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ వీడియోను Awanish Sharan ఐఏఎస్ ఆఫీసర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.  ఇది కేవలం సెకండ్ హ్యాండ్ సైకిల్ మాత్రమే.

వారి ముఖాల్లో ఆనందం చూడండి.. వారు కొత్త మెర్సిడెస్ బెంజ్ ను కొనుగోలు చేసినంత సంతోష పడిపోతున్నారంటూ.. ట్వీట్ చేశారు. ఇది క్షణాల్లో వైరల్ అయ్యింది. దాదాపు 1.7 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరావడం లేదు. సెకండ్ హ్యాండ్ సైకిల్ కు తండ్రి పూజ చేస్తుండగా.. కొంతదూరంలో నిల్చొన్న కొడుకు చప్పట్లు కొడుతూ ఆనందంగా గంతులేస్తుంటాడు. ఆ సైకిల్ తండ్రి దండ వేసి దండం పెట్టగా కొడుకు కూడా అదే విధంగా చేశాడు. ఆ బుడ్డోడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొత్తానికి ఈ వీడియో నెటిజన్ల మనస్సు దోచుకుంది. 
 

మరిన్ని వార్తల కోసం : -

శ్రీలంకకు మన దేశం మరోసారి సాయం

మూడు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్పై పన్ను తగ్గింపు