40 శాతం ఫిట్​మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలి : రాజగోపాల్​

40 శాతం ఫిట్​మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలి : రాజగోపాల్​

మెదక్​టౌన్​, వెలుగు: నలభై శాతం ఫిట్​మెంట్​తో కొత్త పీఆర్సీ వేయాలని ఎస్టీయూ జిల్లా ప్రెసిడెంట్​రాజగోపాల్​ డిమాండ్​చేశారు. ఆదివారం ఎస్టీయూ 77వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకావిష్కరణ చేసి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా స్కూళ్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు టీచర్ల పదోన్నతులు, బదిలీల షెడ్యూల్​ పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

పెండింగ్ లో ఉన్న నాలుగు డీఏలు, పీఆర్సీ ఎరియర్స్​, మెడికల్ బిల్లులు, సరెండర్ బిల్లులు,  జీపీఎఫ్​పార్ట్ ఫైనల్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా జనరల్​ సెక్రెటరీ పోచయ్య, కార్యదర్శి కిష్టయ్య, జిల్లా నాయకులు భూపతిగౌడ్,  శ్రీనివాస్,  మధుసూదన్ రావు, సత్యనారాయణ, దిలీప్ కుమార్,  నరేశ్, ఎల్లం, మల్లేశ్, కిరణ్, సతీశ్, వెంకట కృష్ణ పాల్గొన్నారు.