స్కూల్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థికి కరెంట్ షాక్

స్కూల్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న విద్యార్థికి కరెంట్ షాక్


అమరావతి: స్కూల్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న పదో తరగతి విద్యార్థి గోపీచంద్ (15) కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. కృష్ణా జిల్లా నందిగామలోని అనాసాగరం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిందీ ఘటన. ఈనెల 16 నుంచి ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు ప్రారంభమయ్యాయి. 8వ తరగతి పైబడిన హైస్కూల్ విద్యార్థులకు మాత్రమే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే బుధవారం తరగతులకు హాజరయ్యేందుకు స్కూల్ కు వచ్చిన విద్యార్థుల్లో గోపిచంద్ వాటర్  ట్యాంక్ క్లీన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్ చెప్పడం వల్లే తమ కుమారుడు వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ కరెంట్ షాక్ ప్రమాదానికి గురై చనిపోయాడని తల్లిదండ్రులు ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. పలువురు స్థానికుల మద్దతుతో ఆందోళనకు దిగారు. తమ కుమారుడు కరెంట్ షాక్ తో పడిపోయిన విషయం తెలిసిన వెంటనే  హెడ్మాస్టర్ కనిపించకుండా వెళ్లిపోయారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.