
మారుతున్న లైఫ్ స్టైల్ కారణమో.. లేక ప్రచారంలో ఉన్నట్లు కరోనా వ్యాక్సిన్ ప్రభావమో తెలీదు కానీ.. ఇటీవల హార్ట్ అటాక్స్ ఎక్కువైపోతున్నాయి. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా గుండెపోటు మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అప్పటిదాకా యాక్టివ్ గా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోతున్నాయి. ఓ స్కూల్ స్టూడెంట్ గ్రౌండ్ లో ఆడుకుంటూ కుప్పకూలి చనిపోయిన ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. గురువారం ( సెప్టెంబర్ 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
హనుసుకొండ నయీంనగర్ లోని తేజస్సీ హైస్కూల్లో పదోతరగతి చదువు తున్న పోలేపల్లి జయంతి వర్ధన్ (15) అనుమా నాస్పద స్థితిలో మృతి చెందాడు. అకస్మాత్తుగా విద్యార్థి ముక్కు, చెవి నుంచి రక్తం రావడంతో గుర్తించిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యా యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా,మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారు. విద్యార్ధి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
►ALSO READ | హైదరాబాద్ జీడిమెట్లలో మహిళ నింద మోపిందని అవమానంతో వ్యక్తి ఆత్మహత్య
తమ కుమారుడి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపి స్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా హనుమకొండ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.