హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన యూనివర్శిటీ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుడిని MA ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మయాంక్ కుందుగా గుర్తించారు పోలీసులు. మృతుడి స్వస్థలం వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. గతంలో యూనివర్సిటీలో ల్యాప్‌టాప్‌ల దొంగతనంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు మయాంక్. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
►ALSO READ | హైదరాబాద్లో ఇలాంటి వెధవలు కూడా ఉన్నారా..? మణికొండలో దారుణ ఘటన
