
కరీంనగర్ రూరల్, వెలుగు: గ్రూప్స్ కోచింగ్ కోసం పేరెంట్స్డబ్బులు ఇవ్వడం లేదని కరీంనగర్ రూరల్‌మండలం తీగలగుట్టపల్లికి చెందిన పులి మధుకర్(28) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తీగలగుట్టపల్లి చంద్రపురి కాలనీకి చెందిన పులి తిరుపతిగౌడ్ కొడుకు మధుకర్ బీటెక్పూర్తయినప్పటి నుంచి గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. గతంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా మెయిన్స్‌లో పోయింది. తిరిగి ప్రిపేర్కావడానికి కోచింగ్కోసం రెండు రోజుల క్రితం రూ.25 వేలు పేరెంట్స్దగ్గర తీసుకున్నాడు. మరో రూ. 25 వేలు కావాలని గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అడుగగా ఇంటి పని నడుస్తోందని, తర్వాత చూస్తానని తండ్రి చెప్పడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటికి వచ్చి పురుగుల మందు తాగానని తండ్రికి చెప్పడంతో స్థానికుల సహాయంతో కరీంనగర్ గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.