
తమకు పురుగుల అన్నం పెడుతున్నారని నాలుగో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చింది. ఇదేంటని మేడంని అడిగితే మీ అమ్మ మద్యం మత్తులో వచ్చి న్యూసెన్స్ చేస్తుందని..టీసీ ఇస్తామని టీచర్లు బెదిరిస్తున్నారని మీర్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
దీంతో వెంటనే స్పందించిన ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఆ బాలికను తీసుకుని స్కూల్ కు వెళ్లి అక్కడి పరిస్థితిపై టీచర్లను అడిగి తెలుసుకున్నారు. ఆ విద్యార్థిని తల్లి మద్యం మత్తులో వచ్చి రోజూ న్యూసెన్స్ చేస్తోందని టీచర్స్ చెప్పారు. అందుకే అలా హెచ్చరించినట్లు తెలిపారు. దీంతో పోలీసులు స్టూడెంట్ కు నచ్చ జెప్పి వెళ్లిపోయారు.