స్కూల్ బస్సు కిందపడి విద్యార్థి మృతి

స్కూల్ బస్సు కిందపడి విద్యార్థి మృతి

నల్లగొండ జిల్లాలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ విద్యార్థి మృతి చెందాడు. కొండమల్లేపల్లి మండలంలోని దేవరవాణి తండాలో  ఇస్లావత్ అఖిల్ (5) అనే విద్యార్థి  స్కూల్ బస్సు కింద పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. బస్సు ఎక్కేటప్పుడు డ్రైవర్  బస్సును తీసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.  విద్యార్థి మృతితో తండావాసులు ఆందోళనకు దిగారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్ పరారవ్వడంతో కేసు నమోదు చేసుకున్నారు.