
ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ వెనుక స్థలంలో సమాధి కనిపించి కలకలం సృష్టించింది. ఆదివారం సాయంత్రం అటుగా వెళ్లిన కొందరు విద్యార్థులకు సమాధి కనిపించడంతో భయంతో హాస్టల్‌కు పరుగు తీసి తోటి విద్యార్థులకు చెప్పారు. చీఫ్‌వార్డెన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. సమాధిలో జంతువునా..? మనిషిని పూడ్చిపెట్టారా.? అనేది తేలాల్సి ఉంది. సమాధిపై చల్లిన పూలు తాజాగా ఉండగా రోజుల్లోనే తవ్వి పూడ్చినట్లుగా ఉంది. ఓయూలోకి బయటి వ్యక్తులు రాకుండా కొత్త సెక్యూరిటీతో పటిష్ట బందోబస్తు చేశామని, రౌండ్‌ది క్లాక్ సెక్యూరిటీ పెట్టామని అధికారులు చెపుతుండగా, మరోవైపు క్యాంపస్‌లో సమాధి కనిపించడం విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీనిపై ఓయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గణపతి జాదవ్‌ను ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. దీనిపై తమకు ఎలాంటి కంప్లయింట్ అందలేదని ఓయూ పోలీసులు తెలిపారు.