హైదరాబాద్సిటీ, వెలుగు: నగరంలో వాటర్బోర్డు డీ- సిల్టింగ్ పనులు చేస్తుండగా మ్యాన్ హోళ్లలో నుంచి బ్లాంకెట్లు, బెడ్ షీట్లు, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు బయటకు వస్తున్నాయి. సీవరేజ్ ఓవర్ ఫ్లో పెరుగుతోందని, పైప్లైన్ల లీకేజీలు అవుతున్నాయని ఫిర్యాదులు వస్తుండడంతో బోర్డు చాలా ప్రాంతాల్లో డీసిల్టింగ్పనులు చేపడుతోంది. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో సిల్ట్ అంతా తొలగించినా, మళ్లీ మళ్లీ వేస్తుండడంతో సమస్య పునరావృతమవుతోంది.
ఓఅండ్ఎం డివిజన్ నంబర్21 పరిధిలోని మాదాపూర్సర్కిల్చందర్ నాయక్ తండాలో సమస్య ఉండడంతో మూడు రోజులుగా పనులు చేస్తుండగా బ్లాంకెట్లు, బెడ్షీట్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, వాటర్ బాటిల్స్బయట పడ్డాయి. ఇక్కడే కాదని నగరంలో చాలా చోట్ల ఈ పరిస్థితి ఉందని బోర్డు అధికారులు అంటున్నారు. హోటళ్లు, ఆఫీసులు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, కమర్షియల్బిల్డింగ్స్, మల్టీస్టోరుడ్బిల్డింగ్స్నిర్వాహకులు సీవరేజ్ పైపు లైన్లను నేరుగా బోర్డు సీవరేజ్ నెట్ వర్క్ కు లింక్చేయడంతో ఈ పరిస్థితి నెలకొంటుందన్నారు.
