
బర్త్‌డేకు ఇంటికి వెళ్లాలనే కోరిక.. ఓ స్టూడెంట్ను సాహసం చేసేలా పురిగొల్పింది. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మూడంతస్తుల భవనంపైకి ఎక్కి అక్కడి నుంచి గ్రిల్స్ పట్టుకొని కిందకి దిగేలా చేసింది. సూర్యపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని మైనారిటీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న ఈమె సోమవారం తన పుట్టిన రోజు కావడంతో ఎలాగైనా ఇంటికి పోవాలని అనుకుంది. టీచర్లను అడిగితే ఒప్పుకోరని వాష్ రూమ్ కి వెళ్లి వస్తానని చెప్పి బిల్డింగ్పైకెక్కింది. అక్కడి నుండి గ్రిల్స్ పట్టుకొని కిందకు దిగడం మొదలు పెట్టింది. సెకండ్ ఫ్లోర్‌కు వచ్చే సరికి క్లాస్‌లో ఉన్న ఓ టీచర్ ఇది గమనించి ఆమెను పడకుండా గట్టిగా పట్టుకుంది. నిచ్చెన ఆధారంగా ఆమెను జాగ్రత్తగా కిందకు దించారు.