బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత

బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర కొనసాగుతున్న  ఉద్రిక్తత

బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఖాళీ వాటర్ బాటిల్స్ తో విద్యార్థులు నిరసన తెలుపుతున్నారు. అయితే మెయిన్ గైట్ వైపు విద్యార్థులు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యార్ధులకు సపోర్టుగా వస్తున్న పేరేంట్స్ సహా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇంకోవైపు విద్యార్ధుల ధర్నాకు మద్దతు తెలిపేందుకు వచ్చిన TJS చీఫ్ కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు నిరసనలు కంటిన్యూ చేస్తామని స్టూడెంట్స్ తేల్చిచెప్పారు. 

విద్యార్ధులకు మద్దుతు తెలిపేందుకు వస్తున్న నేతల్ని ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీ దగ్గర గందగోళ పరిస్థితి నెలకొంది. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు బీజేపీ పూర్తి మద్ధతు ఇస్తుందన్నారు ఎంపీ సోయం బాపురావు.  బాసరలో అరకొర వసతులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో స్టూడెంట్స్ సమస్యలు ఎదుర్కొంటున్నాని..సర్కార్ వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కాగా  ఇవాళ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, ఎంపీ బాపూరావు  బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్లనున్నారు.