లాక్‌‌డౌన్‌ ఎఫెక్ట్: ఫ్రెండును సూట్ కేసులో కుక్కి.. అపార్ట్ మెంట్ కి తీసుకెళ్లి..

లాక్‌‌డౌన్‌ ఎఫెక్ట్: ఫ్రెండును సూట్ కేసులో కుక్కి.. అపార్ట్ మెంట్ కి తీసుకెళ్లి..

లాక్‌‌డౌన్‌ వల్ల ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. ఇళ్ళలో ఉండి బోర్ కొడుతుందని చాలామంది చిత్ర విచిత్రంగా పనులు చేస్తున్నారు. తాజాగా మంగుళూరులో కూడా ఒక విచిత్ర ఘటన జరిగింది. ఫ్రెండును సూట్ కేసులో కుక్కి ఇంట్లోకి తీసుకొస్తూ అడ్డంగా దొరికాడో విద్యార్ధి. లాక్‌‌డౌన్‌ వల్ల బయటి వాళ్లకు అపార్ట్ మెంటులోకి అనుమతి లేదని అపార్ట్ మెంట్ వాసులు నిర్ణయించారు. ఇంట్లో ఒక్కడే ఉండలేని విద్యార్థి.. తన ఫ్రెండును ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని అనుకున్నాడు. అంతే అనుకున్నదే తడవుగా.. బయటకు వెళ్లిన విద్యార్థి ఒక పెద్ద సూట్ కేసులో తన ఫ్రెండును కుక్కి తానుండే అపార్ట్ మెంట్ దగ్గరికి వచ్చాడు. వెళ్లేటప్పుడు ఉత్త చేతులతో వెళ్లి.. వచ్చేటప్పుడు మాత్రం భారీ సూట్ కేసుతో రావడంతో అపార్ట్ మెంట్ వాసులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ విద్యార్థిని ఆపి సూట్ కేసు చెక్ చేయగా.. అందులో నుంచి అతని ఫ్రెండ్ బయటకొచ్చాడు.

వెంటనే అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు విషయం తెలియజేశారు. అక్కడకొచ్చిన పోలీసులు ఆ ఇద్దరు విద్యార్థులను స్టేషన్ తీసుకెళ్లి.. వారి తల్లిదండ్రులను పిలిపించారు. లాక్ డౌన్ రూల్స్ అందరూ పాటించాలని చెప్పి వారందరిని అక్కడి నుంచి తమతమ ఇళ్లకు పంపించారు.

For More News..

పాముతో ఫైట్ చేసి.. యజమానిని కాపాడిన కుక్క

అలుగు- గబ్బిలం కలయికే కరోనా

కరోనాతో బంపర్ ఆఫర్.. రూ. 300 కే పండ్లబుట్ట