పరీక్షలో పబ్జీ స్టోరీ.. స్టూడెంట్ ఫెయిల్

పరీక్షలో పబ్జీ స్టోరీ.. స్టూడెంట్ ఫెయిల్

పిచ్చి ముదరి పాకాన పడటమంటే ఇదేనేమో!వరుణ్‌ అనే ఓ స్టూడెంట్ పరీక్షలో ఎకనామిక్స్ సూత్రాలకు బదులు పబ్ జీ వ్యాసం రాసేశాడు.గేమ్‌ ను డౌన్ లోడ్ చేసుకోవడంతో మొదలుపెడితే,ఎక్కడెక్కడ ఏం చేస్తే నెగ్గుకు రావొచ్చనే విషయాలను పూసుగుచ్చినట్లు రాసుకొచ్చాడు. ఆ జవాబు చూసి వెంటనే కాలేజీ ప్రిన్సిపల్‌‌‌‌కు తెలియజేశారు పేపర్‌‌‌‌ దిద్దిన వ్యక్తి. ఆయన పిల్లాడి తల్లిదండ్రులను కాలేజీకి పిలి పించి మాట్లాడారు. వాస్తవానికి వరుణ్ మంచి స్టూడెంట్. బాగా చదువుతాడు. కానీ పబ్ జీ మోజులో పడి చదువును పక్కనబెట్టా డు. వరుణ్ గేమ్ పిచ్చి గురించి తెలుసుకు న్న తల్లిదండ్రులు అతన్నుంచి ఫోన్ లాక్కు న్నారు. ‘‘నేను గేమ్‌ ఆడటం మానేశా. కానీ దానికి సంబంధించిన చిత్రాలు నన్ను వదలడం లేదు. పబ్ జీ ఎంత ప్రమాదమో నాకిప్పుడు అర్థమైంది” అని వరుణ్ చెప్పాడు.