
- కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో ఘటన
సదాశివనగర్/ పెద్దపల్లి, వెలుగు: పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు, నాట్లు వేయడానికి వెళ్లిన రైతులు తిరుగు ప్రయాణంలో వాగులో చిక్కుకున్నారు. వీరిని స్థానికులు తాళ్లు, ట్రాక్టర్ సాయంతో రక్షించారు. ఈ ఘటన కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లో వేర్వేరుగా జరిగింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అమర్లబండ గ్రామానికి చెందిన 15 మంది స్టూడెంట్లు శనివారం ధర్మారావుపేట్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నారు. మధ్యలో రోడ్డుపై వాగు వద్దకు రాగా ఉధృతి పెరిగింది. అప్రమత్తమైన స్థానికులు ట్రాక్టర్ సాయంతో వారిని బయటికి తీసుకువచ్చారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాల గ్రామంలోని పొలాల్లో నాట్లు వేయడానికి గౌరెడ్డిపేట నుంచి 15 మంది కూలీలు వచ్చారు. పనిముగించుకుని వెళ్తుండగా మీర్జంపేట – పోచంపల్లి మధ్య వాగులో చిక్కుకున్నారు. సమీప గ్రామస్తులు తాళ్ల సాయంతో వారిని ఒడ్డుకు చేర్చారు.