
- విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: కరోనా విషయంలో సర్కారు అలర్ట్‌గా ఉంటుందని, స్టూడెంట్లు, పేరెంట్స్ భయపడాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ రెండు డోసులు టీకా వేసుకునేలా ఆయా మేనేజ్‌మెంట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. థర్డ్ వేవ్ వచ్చే చాన్స్ ఉన్నందున తీసుకోవాల్సిన చర్యలపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సోమవారం తన చాంబర్‌లో సమావేశమయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టల్స్‌లోని స్టూడెంట్లు మరింత అలర్ట్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయని, ఆయా విద్యాసంస్థల్లోని స్టూడెంట్లకు స్ర్కీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
‘సివిల్’ ర్యాంకర్ శ్రీజకు అభినందనలు
రాష్ట్రం నుంచి సివిల్స్‌కు ఎంపికైన శ్రీజను సబిత అభినందించారు. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై త్వరలో శిక్షణకు వెళ్లనున్న శ్రీజ సోమవారం మంత్రిని కలిశారు. ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తూనే, సివిల్స్‌లో దేశంలోనే 20వ ర్యాంక్ సాధించటం గొప్ప విషయమన్నారు. యువతరానికి శ్రీజ విజయం స్ఫూర్తినిస్తుందని సబిత అభిప్రాయపడ్డారు.