మెనూ ప్రకారం మీల్స్ పెట్టట్లే.. విద్యార్థుల ఆందోళన

మెనూ ప్రకారం మీల్స్ పెట్టట్లే.. విద్యార్థుల ఆందోళన

మెదక్ ​జిల్లా కౌడిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల వార్డెన్  యాదయ్య తీరును నిరసిస్తూ విద్యార్థులు శనివారం ఆందోళన చేశారు. మెనూ ప్రకారం వార్డెన్  భోజనం పెట్టడం లేదని, తమ సమస్యలు పట్టించుకోవడం లేదని స్టూడెంట్లు పేర్కొన్నారు. ప్రతి చిన్న విషయానికి తిడుతూ, కొడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. 

వారంలో మూడు గుడ్లు, మూడు అరటి పండ్లు ఇవ్వాల్సి ఉండగా రెండే ఇస్తున్నారని తెలిపారు. సాయంత్రం పెట్టే స్నాక్స్ లో పురుగులు ఉంటున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వార్డెన్​ను తొలగించాలని డిమాండ్  చేశారు. ఆందోళన విషయం తెలిసి ఎస్సై శివప్రసాద్ రెడ్డి తన సిబ్బంది వచ్చి స్టూడెంట్లతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

విద్యార్థులను సముదాయించి ధర్నా విరమింపజేశారు. ఈ విషయమై వార్డెన్  యాదయ్యను వివరణ కోరగా బాగా చదువుకోవాలని చెప్పినందువల్లే విద్యార్థులు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.