
కాకతీయ యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. పరిపాలన భవనం ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదువుతున్న విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలంటూ వీసీ ఆదేశాలు ఇవ్వడంతో నిరసనకు దిగారు. వీసీకి వ్యతిరేకంగా బిల్డింగ్ ఎక్కి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సడెన్ గా హాస్టల్ ఖాళీ చేయాలంటే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. వలస కార్మికులకంటే అధ్వానంగా చూస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వీసీ తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులు.