పాసైనా ఫాయిదా లేకపాయె!

పాసైనా ఫాయిదా లేకపాయె!

ఆందోళనలో 30 వేల మంది ఓపెన్ ఇంటర్ స్టూడెంట్స్

మినిమమ్ మార్కులతో పాస్ కావడంతో పలు కోర్సుల్లో ప్రవేశాలకు అనర్హత

క్వాలిఫయింగ్ మార్కులను ఎత్తేయాలని స్టూడెంట్ల రిక్వెస్ట్ లు

హైదరాబాద్, వెలుగు: ఓపెన్ ఇంటర్ స్టూడెంట్లు పాసైనా ఫాయిదా లేకుండా పోయింది. రాష్ర్టంలో ఈ ఏడాది తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కు దరఖాస్తు చేసుకున్న స్టూడెంట్లను ప్రభుత్వం మినిమమ్ మార్కులతో పాస్ చేసింది. అయితే ఆ మార్కులే పలు కోర్సుల్లో అడ్మిషన్లకు అడ్డంకిగా మారాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా వంటి కోర్సుల్లో చేరాలనుకున్న స్టూడెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు.

35 శాతం మార్కులే

కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ, ఎన్ఐఓఎస్ కి అప్లై చేసిన స్టూడెంట్లను అందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. టాస్ ద్వారా ఇంటర్మీడియట్ లో 30,733 మంది, ఎన్ఐఓఎస్ లో సుమారు వెయ్యి మంది వరకు స్టూడెంట్స్ మినిమమ్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్లు 20 వేల మంది దాకా ఉంటారు. వీరంతా ఎంసెట్ రాసేందుకు అర్హులే. కానీ దాంట్లో క్వాలిఫై అయినా సీట్లు పొందేందుకు మాత్రం అనర్హులుగా మారారు. దీనికి ప్రధాన కారణం మినిమమ్ మార్కులే. ప్రభుత్వం అందరినీ 35 శాతం మార్కులతో పాస్ చేసింది. దీంతో వీళ్లు ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, లా తదితర కోర్సుల్లో చేరేందుకు అవకాశం లేకుండా పోయింది. ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలంటే ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, మిగతా వారికి 45 శాతం మార్కులు ఉండాలి. దీంతో ఓపెన్ ఇంటర్ పాసైనా ఉపయోగం లేకుండా పోయిందని స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంసెట్ కు దరఖాస్తు

ఇప్పటికే ఎంసెట్కు సుమారు రెండు వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా అర్హత సాధించినా, సీట్లు వచ్చే పరిస్థితి లేదు. లా కోర్సుల్లో చేరేందుకు నేషనల్ బార్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలు మార్చాల్సి ఉంది. ముందుగా వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతేనే ఫలితం ఉంటుంది. లేకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఇప్పటికే జేఈఈ, నీట్ రాసేందుకు 75 శాతం ఇంటర్ మార్కులుండాలనే రూల్ ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. రాష్ర్టంలో క్వాలిఫయింగ్ మార్కుల అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. అన్ని కోర్సుల అడ్మిషన్లకు మార్కుల రూల్ ను ఎత్తివేయాలని కోరుతున్నారు.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తం

ఓపెన్ స్కూల్ ఇంటర్ స్టూడెంట్ల సమస్య మా దృష్టికి వచ్చింది. ప్రస్తుతం ఆ విద్యార్హతతో అన్ని ఎంట్రెన్స్ పరీక్షలు రాసుకునే అవకాశముంది. కాబట్టి ఇబ్బంది లేదు. అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో దీనిపై నిర్ణయం తీసుకుంటాం. ఈ కరోనా నేపథ్యంలో పాస్ చేసినం కాబట్టి, కాలేజీల్లో ప్రవేశాలకు మినిమమ్ మార్కుల అంశాన్ని తొలగించాలని ప్రభుత్వానికి త్వరలో లేఖ రాస్తాం. ఈ విషయంలో సానుకూలంగానే నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం.

– తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్

For More News..

సగం స్టాఫ్​, సగం శాలరీస్​తో… ప్రైవేట్​ స్కూళ్లు

రెడీ అవుతున్నసిటీ బస్సులు

ఆన్​లైన్​ క్లాస్​లపై ఎవరి ఆర్డర్లు వాళ్లవే