ఆర్మూర్, వెలుగు : జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకులంలో బుధవారం కొందరు ఇంటర్ స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. ఉదయం పులిహోర, దోస తిన్న తర్వాత ఒక్కసారిగా బాడీ పెయిన్స్, తలతిరగడం వంటి లక్షణాలతో బాధపడ్డారు. హుటాహుటిన ఆర్మూర్ ఏరియా హాస్పిటల్కు వారిని తరలించారు. డాక్టర్లు ప్రమిద, అమృత్ రాంరెడ్డి వైద్య సేవలు అందించారు. ఒక విద్యార్థి శ్వాస కోస సమస్యతో బాధపడుతుండడంతో నిజామాబాద్ హాస్పిటల్కు తరలించారు.
