
అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థుల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. కామర్స్ బిల్డింగ్ ముందు సైన్స్ విద్యార్థుల మధ్య ఫైటింగ్ జరిగింది. తోటి విద్యార్థి శివయ్యను బండ రాళ్ళతో మోది.. బెల్ట్ లు, రాడ్ లతో అతి దారుణంగా కొట్టారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు విద్యార్థి శివయ్య.
కిందపడిపోయిన శివయ్యను హాస్పిటల్ కు తీసుకెళ్లారు తోటి విద్యార్థులు. అతడి పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఈ సంఘటన ఆలస్యంగా బయటకొచ్చింది.
కాలేజీలో విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నా.. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు పట్టించుకోలేదనీ… ఆరోపణలు వినిపిస్తున్నాయి.