యూపీలో టీచర్​ను వేధించిన స్టూడెంట్లు

యూపీలో టీచర్​ను వేధించిన స్టూడెంట్లు
  • యూపీలో టీచర్​ను వేధించిన స్టూడెంట్లు
  • వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు

మీరట్: ఉత్తరప్రదేశ్​లోని ఓ స్కూల్​లో మహిళా టీచర్​ను కొందరు స్టూడెంట్స్ వేధింపులకు గురి చేశారు. టీచర్ ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రాధనా ఇనాయత్​పూర్ గ్రామంలోని స్కూల్​లో ఈ ఘటన చోటుచేసుకుంది. 12వ తరగతి చదువుతున్న నలుగురు స్టూడెంట్లు వారికి పాఠాలు చెప్పే 27 ఏండ్ల మహిళా టీచర్​ను లైంగికంగా వేధించారు. క్లాస్​ రూమ్​లో అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు తీసి సోషల్​మీడియాలో పోస్ట్​చేశారు. దీంతో ఆదివారం ఆ టీచర్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘నలుగురు స్టూడెంట్లు చాలాకాలంగా క్లాస్ రూంలోనే నన్ను​అసభ్యపదజాలంతో వేధిస్తున్నారు.  

హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది. జూన్​ 24న స్కూల్​ ఆవరణలో ‘ఐ లవ్​యూ’ అంటూ వెంటపడుతూ.. వీడియోలు తీశారు. ఈ వీడియోతో పాటు క్లాస్​రూంలో అసభ్యపదజాలంతో వేధించిన వీడియోను కూడా వారు సోషల్​ మీడియాలో షేర్​ చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్​ అయ్యాయి’ అని కంప్లెయింట్​లో పేర్కొన్నారు. టీచర్​ కంప్లెయింట్​తో స్టూండెట్స్​ను అదుపులోకి తీసుకొని జువెనైల్​జస్టిస్​బోర్డు ఎదుట హాజరు పరిచినట్టు కితౌర్​ఎస్​హెచ్​వో అరవింద్​​మోహన్​శర్మ తెలిపారు. ఆ స్టూడెంట్స్ వయసు సుమారు 16 సంవత్సరాలు ఉంటుందని ఆయన వెల్లడించారు.