స్కూలు పైకప్పు నుంచి వాటర్ లీక్ ... గొడుగు నీడలో పాఠాలు

స్కూలు పైకప్పు నుంచి వాటర్ లీక్  ... గొడుగు నీడలో పాఠాలు

క్లాస్ రూమ్ లో రేకులు పగిలిపోయి వర్షపు నీరు పడుతున్నా .. గొడుగులు వేసుకొని కూర్చున్న విద్యార్డులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైకప్పు దెబ్బతిని  తరగతి గదుల్లో గొడుగులతో  విద్యార్థుల అవస్థలు ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.  అమిత్ మాల్వియా అనే ఖాతా నుంచి పోస్ట్ చేసిన వీడియో లో క్లాస్ రూం కూలిపోయే స్థితిలో ఉంది.  పైకప్పు నుంచి వర్షపు నీరు  లీక్ అయ్యే ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.  భాగల్‌పూర్ జిల్లాలోని సైద్‌పూర్ బ్లాక్‌లోని గోప్లాపూర్ ఉన్నత పాఠశాలలో రికార్డ్ చేశారు. క్లాస్ రూమ్ లో  విద్యార్థులు గొడుగులు పట్టుకున్నట్లు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందించారు.  

చాలామంది సోషల్ మీడియా యూజర్లు  ప్రభుత్వ పాఠశాలలు ఎంత దురదృష్టకర పరిస్థితిలో ఉన్నాయని కామెంట్ చేశారు.  దేశ వ్యాప్తంగా సర్కారీ బడులు ఎలా ఉన్నాయో ఈ వీడియో నిదర్శనమని మరికొందరు పోస్ట్ చేశారు.  ఇలాంటి పరిస్థితిలో విద్యార్థులు తరగతి గదిలో గొడుగులు పట్టుకొని కూర్చోవడం చాలా బాధగా ఉందని మరొకరు కామెంట్ చేశారు.INC రాష్ట్ర కోఆర్డినేటర్, న్యాయవాది అనుజ్ శుక్లా ఈ పరిస్థితిని ప్రభుత్వం గమనించి పాఠశాలల్లోని  మౌలిక సదుపాయాలలో లోపాలను పరిష్కరించాలని కోరారు.   ఈ వీడియోను ఇప్పటివరకు ( వార్త రాసే సమయం వరకు) 47 వేల మంది చూడగా..  700 మంది రీపోస్ట్ చేశారు.  18 వందల మంది లైక్ చేశారు.  
 
పాఠశాల నిర్వహణ, మౌలిక సదుపాయాలు సరిగా లేనందున స్కూలుకు వెళ్లడం లేదని పదో తరగతి విద్యార్థిని సింధుక్ మార్వార్ తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంటనే సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.  అయితే  విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఎన్ని లేఖలు రాసినా పట్టించుకోవడంలేదని సైద్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తు్న్నారు.