వరి నాట్లేసిన విద్యార్థినిలు

వరి నాట్లేసిన విద్యార్థినిలు

చిన్నారులకే కాదు కొందరు పెద్దలకు కూడా పంటలు ఎలా పండిస్తారో కూడా తెలియదు. ఉన్నత చదువులు చదువుకోవడం..ఉద్యోగాల పేరుతో పట్టణాలకు వెళ్లడం. ఇంకొందరైతే విదేశాల బాట పడుతున్నారు.ఇల్లు, ఆఫీసులే వారి లోకంగా మారుతున్నాయి. ఇక మనం రోజూ తినే ఫుడ్ ఎలా ఎక్కడి నుంచి వస్తుంది…వాటిని ఎలా పండిస్తారో వారికి తెలియడం కష్టమే. అయితే ఓ కాలేజీ యాజమాన్యం మాత్రం విద్యార్ధులకు వ్యవసాయం ఎలా చేస్తారో..తెలియజేయాలనుకున్నారు. అంతేకాదు వారిని ప్రక్షంగా పొలం పనులను పరిచయం చేయాలని నిర్ణయించింది.

సూర్యాపేట జిల్లా గిరిజన గురుకుల డిగ్రీ కాలేజీ ప్రన్సిపాల్‌ …వృతి విద్యలో భాగంగా వారిచే కాసేపు పొలం పనులు చేయించాలని నిర్ణయించారు. మునగాల మండలం ఆకుపాముల దగ్గర  కాలేజీ పక్కన ఉన్న పొలాల్లోకి విద్యార్థినిలను తీస్కెళ్లారు. స్టూడెట్స్ ఉత్సాహంగా వరి నాట్లు వేశారు.100 మంది విద్యార్థినిలతో పాటు,కాలేజీ ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు కూడా ఇందులో పాల్గొన్నారు. విద్యార్థులు పొలం పనులు చేయడంపై పలువురు ప్రశంసించారు.