విద్య, వైద్య రంగాలకు సర్కారు ప్రాధాన్యం : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి 

విద్య, వైద్య రంగాలకు సర్కారు ప్రాధాన్యం : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి 

హాలియా, వెలుగు: విద్య, వైద్యరంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం హాలియా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో రూ.12 లక్షల విలువైన 150  డెస్క్ బెంచీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తన సొంత ఖర్చులతో పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తానని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి భవిష్యత్​లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. అంతకుముందు పెద్దవూర మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించారు.

 అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో మృతి చెందిన అలుగుల నర్సమ్మ మృతదేహాన్ని మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ లింగారెడ్డి, మార్కెట్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కుందూరు వెంకటరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి, ఎడవల్లి నరేందర్ రెడ్డి, టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.