ఉస్మానియా వర్సిటీ హాస్టల్​లో నాగు పాము

ఉస్మానియా వర్సిటీ హాస్టల్​లో నాగు పాము
  • పట్టుకునేందుకు యత్నించగా పొదల్లోకి వెళ్లి మాయం

ఓయూ, వెలుగు: ఉస్మానియా వర్సిటీలోని రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ లో నాగు పాము కనిపించడంతో స్టూడెంట్లు భయాందోళనకు గురయ్యారు. సోమవారం ఉదయం రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ ఎన్ఆర్ ఎస్ హెచ్ లో మెయిన్​డోర్ పక్కన నాగుపాము కనిపించడంతో స్టూడెంట్లు భయంతో పరుగు తీశారు.

కొందరు స్టూడెంట్లు పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. హాస్టల్ రూమ్ లోకి పాములు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని.. భయంతో ఉండాల్సి వస్తోందని స్టూడెంట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాముల బెడద నుంచి కాపాడాలని కోరారు.