- వార్డెన్, ఎస్ వో పై విద్యార్థుల ఫిర్యాదు
- హాస్టల్ పరిశీలించిన ఆఫీసర్లు, ఎమ్మెల్యే రాగమయి
పెనుబల్లి, వెలుగు: హాస్టల్ లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు నిరసన తెలిపారు. మండ లంలోని టేకులపల్లి మోడల్ స్కూల్ లో నాసిరకం భోజనం పెడుతున్నారని, మెనూ పాటించడం లేదని రెండు రోజులుగా హాస్టల్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీసీడీవో తులసి, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం హాస్టల్ ను తనిఖీ చేశారు. హాస్టల్ కుకూరగాయలు, కోడిగుడ్లు రెండురోజులకోసారిసప్లై చేయాల్సి ఉండగా, 10 రోజులకోసారి సప్లై చేస్తున్నా దని గుర్తించారు. ఆదివారం అందించే చికెన్ కూడా నాసిరకంగా ఉండడంతో,
తల్లిదండ్రులు ఇంటి నుంచి బాక్సులు తీసుకువస్తున్నట్లు తేలింది. హాస్టల్లో రూ.9 లక్షలతో రిపేర్ పనులు చేసినప్పటికీ, పలు రూమ్ లలో పెచ్చులు ఊడిపోయి భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇన్చార్జి ఎస్ వో నెలకు ఒక్కసారి కూడా హాస్టలకు రావడం లేదని విద్యార్థులు వాపోయారు. హాస్టల్ పరి సరాల్లో గడ్డి మేపుకునేందుకు ఒక్కో గేదెకు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారని విద్యార్థులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు ఎమ్మెల్యే రాగమయి హాస్టల్ ను సందర్శించారు. వంటగదిని పరిశీలించి, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంఈవో సత్యనారాయణ, ప్రిన్సిపాల్ రూపస్ పాల్గొన్నారు.
జాబ్ మేళాను విజయవంతం చేయాలి
సత్తుపల్లి, వెలుగు: ఈ నెల 26న నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి కోరారు. శుక్రవారం సత్తుపల్లిలోని రాణి సెలబ్రేషన్స్ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గంలోని అన్ని మండలాల అధికారులతో సమావేశమయ్యారు. సుమారు 3 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఫంక్షన్హాల్లోనే జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
r
