అధిక మెస్ ఛార్జీలపై విద్యార్థుల లొల్లి

అధిక మెస్ ఛార్జీలపై  విద్యార్థుల లొల్లి

హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో అధిక మెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ నిరసన తెలిపారు. థర్డ్ సెమిస్టర్ ఎగ్జామ్కు వచ్చిన పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థులను, సిబ్బందిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు తీవ్ర వాగ్వాదం జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సమీపంలోనే అసెంబ్లీ సమావేశాలు జరగడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. తమపై మోపిన అధిక ఛార్జీలను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ అంశంపై యూనివర్సిటీ రిజిస్టర్తో మాట్లాడిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.