సుల్తాన్ పూర్ JNTU ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ధర్నా

సుల్తాన్ పూర్ JNTU ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల ధర్నా

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ ముందు విద్యార్థులు ఆందోళన చేశారు. క్యాంపస్ క్యాంటీన్ మెస్ లో నాణ్యతలేని భోజనం పెడుతున్నారంటూ ప్రిన్సిపాల్,కాంట్రాక్టర్ పై విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఎన్టీయూ క్యాంపస్ క్యాంటీన్ లో  రాత్రి  భోజనం చేసిన పలువురు విద్యార్థులకు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వాంతులు,విరోచనాలతో పలువురు స్టూడెంట్స్ ఇబ్బందులు పడ్డారు. మెస్ కాంట్రాక్టర్ ను తొలగించే వరకు ధర్నా విరమించేది లేదంటూ విద్యార్థుల డిమాండ్ చేశారు. 

క్యాంటిన్ లో టిఫిన్ కూడా బాగుండటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వారం,పది రోజుల నుంచి పప్పు తప్ప వేరే కూరలు తినడం లేదని చెబుతున్నారు. సాంబారు నీళ్ల మాదిరిగా ఉన్నాయని ఆరోపించారు. మెస్ లో నాణ్యమైన భోజనం పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ వచ్చి సరైన సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేంది లేదని గేటు ముండు భైఠాయించి నిరసన తెలియజేశారు.