టీచర్లు కావాలని.. విద్యార్థుల ఉపవాస దీక్ష

టీచర్లు కావాలని.. విద్యార్థుల ఉపవాస దీక్ష

పరిగి, వెలుగు: తమకు ఫ్యాకల్టీ ఏర్పాటు చేసి పాఠాలు చెప్పాలని, డిజిటల్​ క్లాసులతో సరిపెట్టుకోవాలంటే కుదరదని స్టూడెంట్స్​ ఆందోళనకు దిగారు. వికారాబాద్ జిల్లా పరిగి విద్యారణ్యపురి గిరిజన బాలికల గురుకుల స్కూల్​/కాలేజీలో కొంతకాలంగా మ్యాథ్స్​, కెమిస్ట్రీ సబ్జెక్టులకు టీచర్లు లేరు. ప్రత్యామ్నాయంగా డిజిటల్ క్లాసుల ద్వారా పిల్లలకు బోధన అందిస్తున్నారు. 

గణితంలో తమకు డౌట్లు వస్తే డిజిటల్​ క్లాసుల్లో పరిష్కారం దొరకడం లేదని, తప్పకుండా తమకు టీచర్లను ఏర్పాటు చేయాలని విద్యార్థినులు డిమాండ్​ చేస్తున్నారు. ఈ మేరకు పాఠశాల ఆవరణలో గురువారం ఉపవాస దీక్షకు దిగారు. ఫ్యాకల్టీ కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకున్నారు. విషయాన్ని కలెక్టర్​ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని పాఠశాల ప్రిన్సిపాల్ వారికి సర్దిచెప్పారు.