విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి..తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

విద్యార్థులను ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలి..తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
  • కరీంనగర్ జిల్లాలోని చల్లూరు ప్రభుత్వ స్కూల్ పరిశీలన

వీణవంక, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లకు దిక్సూచిగా చల్లూరు పాఠశాల ఉందని, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా టీచర్లు పని చేస్తున్నట్టు తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చెల్లూరు ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.

పాఠశాలలో నిర్వహించే న్యూస్ రీడింగ్, ఇంగ్లీష్ క్లబ్ నిర్వహణ, ఆర్ట్అండ్ క్రాఫ్ట్, పాఠశాల సుందరీకరణ, విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.  విద్యార్థి విష్ణు టెడ్ హెడ్ అంతర్జాతీయ ప్లాట్ ఫామ్ పై ఇంగ్లీషులో స్పీచ్ ఇవ్వడంతో పాటు, ఇక్రా ఇంగ్లీష్ క్లబ్ పై విద్యార్థులు వివరించడంతో ప్రశంసించి పెన్నులు బహుకరించారు.

 విద్యార్థుల పరీక్ష రికార్డులను పరిశీలించి ప్రతి విద్యార్థి ఆల్ రౌండ్ డెవలప్ మెంట్ సాధించే విధంగా టీచర్లు తీర్చిదిద్దాలని సూచించారు. చల్లూరు పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ సాధించేలా సహకారం అందించాలని అందించాలని దిశ నిర్దేశం చేశారు. మధ్యాహ్న భోజన  నిర్వాహకులు ఐదు నెలలుగా జీతాలు రావడం లేదని, ఆర్థికంగా ఇబ్బందులకు పడుతున్నామని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చా రు.

ప్రతి నెల జీతాలు వచ్చేలా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడే, డీఈవో శ్రీరామ్ మొండయ్య, ప్లానెట్ కో - ఆర్డినేటర్ జంబో శ్రీనివాస్, తహసీల్దార్ అనుపమరావు, ఎంపీఓ సురేందర్, ఎంఈఓ శోభారాణి, ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్ ఉన్నారు.