స్టూడెంట్లు న్యూట్రిషన్​పై ఫోకస్​ చేయాలి: డాక్టర్ జి.సరోజావివేక్

స్టూడెంట్లు న్యూట్రిషన్​పై ఫోకస్​ చేయాలి: డాక్టర్ జి.సరోజావివేక్

ముషీరాబాద్, వెలుగు: స్టూడెంట్లు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని కాకా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్ కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజా వివేక్ సూచించారు. గురువారం ఇనిస్టిట్యూషన్​లోని న్యూట్రిషన్​విభాగం ఆధ్వర్యంలో ‘పోషకాహార విలువలు’పై సదస్సు నిర్వహించారు. స్టూడెంట్లు న్యూట్రిషన్​ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇనిస్టిట్యూషన్​జాయింట్ సెక్రటరీ రమణ కుమార్ తో కలిసి సరోజావివేక్ స్టాళ్లను పరిశీలించారు. స్టూడెంట్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, న్యూట్రిషన్​పై ఫోకస్​చేయాలని చెప్పారు. న్యూట్రియంట్స్​ఉన్న ఫుడ్​తో జ్ఞాపకశక్తి పెరుగుతుందని, ఫిట్​గా ఉంటారని తెలిపారు. త్వరలో కాలేజీ స్టూడెంట్లకు ప్రతివారం బలమైన ఆహారం అందిస్తామని చెప్పారు. అంతకుముందు అంబేద్కర్ కాలేజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆధ్వర్యంలో గ్లోబల్ ఇంపాక్ట్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే అంశంపై సోషల్ సైన్స్ విద్యార్థులకు గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. డాక్టర్ మల్లిక హాజరై మారుతున్న సామాజిక శాస్త్ర మూలాలకు అనుకూల మార్పులు, కరెంట్ అఫైర్స్, అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూషన్స్​డెరెక్టర్లు, ప్రిన్సిపాల్స్, లెక్చరర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.