స్టడీస్ కోసం మళ్లీ విదేశాల బాట పడుతున్న స్టూడెంట్స్

స్టడీస్ కోసం మళ్లీ విదేశాల బాట పడుతున్న స్టూడెంట్స్

అబ్రాడ్ లో స్టడీస్ కు మళ్లీ క్రేజ్ పెరుగుతోంది. కరోనా తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ ఫారిన్ వెళ్తున్నారు. బీటెక్ తర్వాత... విదేశాల్లో ఎంఎస్ చదివితే త్వరగా లైఫ్ సెటిల్ అవ్వొచ్చని అంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్ కు లక్షల మంది స్టూడెంట్స్ వెళ్లినట్టు కన్సల్టెన్సీలు చెప్తున్నాయి.

స్టూడెంట్స్ మళ్లీ విదేశాల బాట

కరోనా కాలంలో ఫారిన్ లో చదువంటేనే చాలామంది భయపడ్డారు. కోవిడ్ దెబ్బకు ఎంతో మంది విదేశాల నుంచి వచ్చేశారు. ప్రస్తుతం ఆ భయం నుంచి బయటపడి స్టూడెంట్స్ మళ్లీ విదేశాల బాట పడుతున్నారు. డిగ్రీ, బీటెక్ తర్వాత MS కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఫారిన్ లో చదుకుంటూనే పార్ట్ టైం జాబ్ చేసుకునే చాన్స్ ఉంటుంది. స్టడీస్ తర్వాత మంచి జాబ్ తో పాటు, టైమ్ బాగుంటే.. గ్రీన్ కార్డ్ కూడా వస్తుండడంతో ఎక్కువ మంది విదేశాలకు వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అబ్రాడ్ లో స్టడీ

అబ్రాడ్ లో స్టడీ చాలామంది స్టూడెంట్స్ కల. బ్యాంకు లోన్లు, బయట అప్పు చేసైనా సరే పేరంట్స్ పిల్లలను విదేశాలలో చదివించాలనుకుంటున్నారు. విదేశాల్లో చదువుకునే ఆలోచన ఉన్న పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం రుణ సాయం కూడా అందిస్తోంది. హయ్యర్ స్టడీస్ కోసం స్టూడెంట్స్ తమను అప్రోచ్ అవుతున్నారని కన్సల్టెన్సీ నిర్వాహకులు చెప్తున్నారు. వీరిలో ఎక్కువ మంది యూఎస్ చూజ్ చేసుకుంటున్నారని అంటున్నారు. డాలర్ విలువ పెరిగినా ఫైనాన్సియల్ గా కాస్త ఇబ్బందులున్నాయంటున్నారు. అయినా లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ మంది ఫారిన్ వెళ్తున్నారని అంటున్నారు.

జాబ్ ఆఫర్స్ కూడా ఎక్కువ

విదేశాలతో మంచి ఎడ్యుకేషన్ తో పాటు.. జాబ్ ఆఫర్స్ కూడా ఎక్కువగా ఉండడంతో అక్కడికే వెళ్తున్నామని స్టూడెంట్స్ చెప్తున్నారు. లక్షలు ఖర్చు అయినా సరే మంచి జాబ్ వస్తే.. త్వరగా సెటిల్మెంట్ ఉంటుందని అంటున్నారు. అబ్రాడ్ లో స్టడీస్ కోసం వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని కన్సల్టెన్సీ నిర్వాహకులు సూచిస్తున్నారు. స్టడీస్ కోసం వెళ్లే వారు యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. సంపాదనే టార్గెట్ గా కాకుండా.. ముందు స్టడీస్ కంప్లీట్ చేయాలంటున్నారు.