
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ(పీయూ)లోని హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టూడెంట్లు ధర్నాకు దిగారు. శుక్రవారం వర్సిటీ మెయిన్‌గేట్‌కు తాళం వేసి అధికారుల నిర్లక్ష్య వైఖరిపై నిరసన తెలిపారు. సాయంత్రం 6 గంటల దాకా బైఠాయించారు. సమస్యలను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన లేదన్నారు. హాస్టళ్లలో నీళ్ల సౌలత్లు లేవని, రూమ్‌లలో లైట్లు, ఫ్యాన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. మెస్‌లో భోజనం సరిగా పెట్టట్లేదని మండిపడ్డారు. రూమ్‌లలో బెడ్లు లేక నేలపైనే పడుకోవాల్సి వస్తోందని, వర్షం పడితే నీళ్లు రూమ్‌లలోకి చేరుతుండటంతో నరకయాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వీసీ లక్ష్మికాంత్ రాథోడ్ వచ్చి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో స్టూడెంట్లు ధర్నాను విరమించారు.