స్కైవాక్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన విద్యార్థులు

స్కైవాక్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన విద్యార్థులు

ఉప్పల్, వెలుగు : స్కైవాక్ లిఫ్ట్ లో విద్యార్థులు ఇరుక్కుపోయి ఇబ్బంది పడిన ఘటన ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తాలోని జరిగింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ముగ్గురు విద్యార్థులు జ్యోతి, వాసవి, జాన్సన్  మెట్రోస్టేషన్ వైపు వెళ్లేందుకు ఉప్పల్ రింగ్ రోడ్డులోని స్కైవాక్ లిఫ్ట్ ఎక్కారు. బయటకు వెళ్లేందుకు డోర్లు తెరుచుకోలేదు. ఎంతసేపటికి డోర్లు ఓపెన్ కాకపోవడంతో ఆందోళన చెంది100కు కాల్ చేశారు.

ఉప్పల్, ట్రాఫిక్ పోలీసులు వెళ్లి లిఫ్ట్ డోర్ పగల గొట్టి విద్యార్థులను బయటకు తీశారు. అయితే.. లిఫ్ట్ లోని టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసినా స్పందన లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా సంబంధిత అధికారుల నిర్లక్ష్యంగానే ఉంటున్నారని పలువురు విమర్శించారు.