సర్కార్ బడులకు టెక్నాలజీ అందట్లే..

సర్కార్ బడులకు టెక్నాలజీ  అందట్లే..

హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీలో ముందున్నామని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం.. సర్కార్ బడులకు మాత్రం ఆ టెక్నాలజీని అందించడం లేదు. కేంద్రం విడుదల చేసిన యూడైస్ 2020–21​ రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం 42,917 స్కూళ్లు ఉండగా.. 30,015 సర్కారు,12,023 ప్రైవేటు, 700 ఎయిడెడ్, 179 ఇతర మేనేజ్మెంట్లకు చెందిన బడులు ఉన్నాయి. మొత్తంగా 16,443 (38.31%) స్కూళ్లలో కంప్యూటర్లు ఉండగా, వాటిలో 16,099 స్కూళ్లలో పని చేస్తున్నాయి. 7,492 (24.96%) సర్కార్ బడుల్లో కంప్యూటర్లు ఉండగా, వాటిలో 7,244 బడుల్లోనే పని చేస్తున్నాయి. 8,696  ప్రైవేటు బడుల్లో కంప్యూటర్లు ఉన్నా 8,605 (71%) స్కూళ్లలోనే పని చేస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 9,665 (22.32%) స్కూళ్లలో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండగా... వాటిలో సర్కార్ స్కూళ్లు 2,460(8.2%), ప్రైవేట్  7,018(58%), ఎయిడెడ్ 173, 14 ఇతర మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లు ఉన్నాయి. 

రిపోర్టులోని మరిన్ని అంశాలు.. 

  •     రాష్ట్రంలో 38,879 స్కూళ్లలో కరెంట్ సౌకర్యం ఉండగా.. వాటిలో 26,119 సర్కార్, 11,945 ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయి. 
  •     39,805 స్కూళ్లలో తాగునీటి సౌకర్యం ఉంది. 90% సర్కార్, 99% ప్రైవేటు స్కూళ్లలో ఈ ఫెసిలిటీ ఉంది.  
  •     రాష్ట్రంలో 39,444 (96%) స్కూళ్లలో లైబ్రరీలు ఉన్నాయి. 92.79% సర్కార్ స్కూళ్లలో, 90.65% ప్రైవేటు స్కూళ్లలో ఇవి ఉన్నాయి. 
  •     35,876 స్కూళ్లలో టాయ్ లెట్స్ పని చేస్తుండగా.. వాటిలో 23,181 సర్కారు, 11,913 ప్రైవేటు, 607 ఎయిడెడ్, 175 ఇతర స్కూళ్లు ఉన్నాయి.