ఖమ్మం నగర నడిబొడ్డున 57వ డివిజన్ లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులు టార్ఫాలిన్ల కింద చదువులు సాగిస్తున్నారు. ఇక్కడ 1 నుంచి 5 వ తరగతి వరకు 55 మంది విద్యార్థులుండగా..ఇద్దరు టీచర్లు చదువు చెప్తున్నారు. సొంత బిల్డింగ్ లేకపోవడంతో టీచర్లు నెలకు రూ.వెయ్యి రెంట్ఇస్తూ ఓ రేకుల షెడ్డు కింద విద్యాబోధన కొనసాగిస్తున్నారు. షెడ్డు సరిపోకపోవడంతో ముందు టార్ఫాలిన్ కవర్ వేసి దాని కింద తరగతులు నడిపిస్తున్నారు. అయినా వానలకు తడుస్తూ పిల్లలు పాఠాలు వినాల్సి వస్తోంది.
