
రెండో తరగతి వరకు అందుబాటులోకి తెచ్చిన గిరిజన శాఖ
కోయ, గోండు, బంజారా, కొలామిభాషల్లో బుక్స్
లిపితెలుగు..భాషమాత్రం గిరిజన తెగలవి..
అచ్చంగా గిరిజన స్థానికత ఉట్టి పడేలా పుస్తకాల రూపకల్పన
హైదరాబాద్, వెలుగు: ఆదివాసీ స్టూడెంట్లు ఇకపై సొంత భాషలోనే చదువుకోనున్నారు. గతేడాది ఫస్ట్ క్లాస్ లో గిరిజన భాషలను అందుబాటులోకి తీసుకొచ్చిన గిరిజన శాఖ.. తాజాగా రెండో తరగతిలోనూ మార్పులు చేసింది. రాష్ట్రంలోని ట్రైబల్‌స్కూళ్లలో చదువుకునే గిరిజన స్టూడెంట్ల కోసం కోయ, గోండు, బంజారా, కొలామి భాషల్లో కొత్తగా పుస్తకాలు తీసు కొచ్చింది. లిపి తెలుగులోనే ఉంటుంది. అయితే భాష మాత్రం ఆయా గిరిజన తెగలది ఉంటుంది. ఈ మార్పులన్నీ ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి రానున్నాయి. స్టూడెంట్లలో తెలుగుపై ఆసక్తి పెంచడంతో పాటు డ్రాపౌట్స్ తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
సెకండ్ క్లాస్‌లో..
రాష్ట్రవ్యాప్తంగా 1,426 గిరిజన ప్రైమరీ స్కూళ్లు ఉన్నాయి. ఇవి గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇప్పటిదాకా తెలుగు భాషలోనే మొత్తం పాఠాలు ఉండేవి. ఇకపై ఈ విద్యా సంవత్సరం నుంచి రెండో తరగతిలో గిరిజనుల మాతృ భాషలైన కోయ, గోండు, బంజారా, కొలామిలను అందుబాటులోకి తీసుకొచ్చారు. గతేడాది ఒకటో తరగతిలో వర్ణమాల, చిన్నచిన్న అక్షరాలు మాత్రమే తీసుకొచ్చారు. ఈ ఏడాది నుంచి రెండో తరగతి పుస్తకాల్లో పూర్తిగా పాఠాలు తెచ్చారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ, గిరిజన టీచర్లు చర్చించి ఈ పుస్తకాలను రూపొందించారు. ఒక్కోపుస్తకం 60 పేజీలతో ముద్రించారు. ఆయా తెగల భాషలు రాని తెలుగు టీచర్లు కూడా బోధించేలా పుస్తకం లాస్ట్‌లో ఐదారు పేజీల్లో సారాంశంపెట్టారు.
తెలుగుపై ఇంట్రెస్ట్ పెంచేలా..
గిరిజనులకు భాష ఉంటుంది. కానీ లిపి ఉండదు. సాధారణంగా తెలుగు స్టూడెంట్లకు ప్రారంభంలో ఇంగ్లిష్‌ంగ్లి ఎలా గొట్టుగా అనిపిస్తుందో ఆయా గిరిజన స్టూడెంట్లకు కూడా తెలుగు.. ఫారిన్ లాంగ్వేజ్ మాదిరి కఠినంగా అనిపిస్తుంటుం ది. ఇలా ఉండటం వల్ల స్టూడెంట్లుచదువుకు అలవాటు పడకపోవడం, తెలుగు అర్థం కాకపోవడంతో చదువుకోవడానికి ఆసక్తి చూపడంలేదు. చాలా మంది మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు. వీటిని అధిగమించేందుకు ఆయా సొంత భాషల్లో పాఠాలు చెబుతూ తెలుగు నేర్పనున్నారు. స్కూల్‌కు అలవాటయ్యేలా మొదటి మూడు నెలలపాటు ఈ పాఠాలు ఉంటాయి. తర్వాత ఇదే క్లాస్ లో మొత్తం తెలుగులో పాఠాలు కొనసాగిస్తారు.
కూడికలు, తీసివేతలుకూడా..
పాఠాలతో పాటు మ్యాథ్స్ కూడా గిరిజన భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. మ్యాథ్స్‌లోని అంకెలను సొంత భాషలో పరిచయంచేస్తూ కూడికలు, తీసివేతలు, ఎక్కాలపై పట్టుసాధించేలా రూపొందించారు. కేంద్రం కూడాకొత్త ఎడ్యుకేషన్‌పాలసీలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చింది. మన రాష్ట్రంలో తెలుగు మాతృభాష. కానీ కోయ, గోండు, బంజారా, కొలామి తెగలకు ప్రత్యేకంగా మాతృభాష ఉంది. ఆ భాషల నుంచి తెలుగు వైపు స్టూడెంట్లను మళ్లించేందుకు ఇలా అధికారులు ప్రయత్నిస్తు న్నారు. వచ్చే ఏడాది థర్డ్‌క్లాస్ లో కూడా తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అచ్చంగాగిరిజన స్థా నికతఉట్టిపడేలా..
కొత్త పుస్తకాల్లోఅన్నీ గిరిజన జాతుల స్థానికత ఉట్టిపడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. చూడగానే స్టూడెంట్లు ఇష్టపడేలా కలర్స్‌తో పుస్తకాలను రూపుదిద్దారు. కోయ, గోండు, బంజారా, కొలామి జీవన విధానాలను ముద్రించారు. ఆయా తెగల సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, పరిసరాలను పొందుపరిచారు. ట్రైబల్ పెయింటింగ్స్ పెట్టారు.
ఇంట్రస్ట్ పెంచేందుకు..
గతేడాది ఫస్ట్ క్లాస్‌లో ఆయా తెగల భాషలను తీసుకొచ్చాం. అందులో కేవలం ఓనమాలు మాత్రమే పొందుపరిచాం. ఇది సక్సెస్ అయ్యింది. పిల్ల డ్రాపౌట్స్ తగ్గాయి. పేరెంట్స్ కూడా మెచ్చుకున్నారు. దీంతో ఈ ఏడాది రెండో తరగతిలో పాఠాలు తీసుకొచ్చాం. పిల్లకు ఈజీగా అర్థమయ్యేలా ఆర్నెల్ల పాటు పరిశోధించి పుస్తకాలను రూపొందించాం. వీటితో స్టూడెంట్లలో ఇంట్రెస్ట్ పెరుగుతుంది. – సర్వేశ్వర్ రెడ్డి, డైరెక్టర్, గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ