ఆర్టీసీ ఆదాయం పెరగాలి..హైదరాబాద్ లోని కొత్త కాలనీలకు బస్ సర్వీసులు పెంచండి

ఆర్టీసీ ఆదాయం పెరగాలి..హైదరాబాద్ లోని కొత్త కాలనీలకు బస్ సర్వీసులు పెంచండి

మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి సాధించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.  ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారని చెప్పారు. ప్రభుత్వం  ఆర్టీసీకిరూ. 7,980 కోట్లు  చెల్లించిందన్నారు.  ఆర్టీసీ బస్సులు ,బస్ స్టేషన్ లలో &  టీమ్ మిషన్ ల ద్వారా వచ్చే టికెట్ పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని అధికారులకు  సూచించారు.

ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు ,వికారాబాద్ , బీహెచ్ఈఎల్ , మియాపూర్ , కుషాయిగూడ , దిల్ సుఖ్ నగర్ , హకీంపేట్ , రాణిగంజ్ , మిథాని తో పలు పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు , స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. 

నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్ కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. 

నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు ,నగరానికి సంబంధించిన వారు ఉదాహరణగా కొల్లూరు వద్ద డబుల్ బెడ్ రూం ల వద్ద నివసిస్తున్న వేలాది మందికి రవాణా సౌకర్యాలు కల్పించడానికి డిమాండ్ కు అనుగుణంగా కొత్త రూట్ లలో బస్సులు నడిపించేలా స్థానిక డీఎం ఇతర ఆర్టీసీ అధికారులతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఒక నివేదికను రూపొందించి బస్సులు నడిపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 578 బస్సులు కొత్తగా రాష్ట్రంలో రోడ్డెక్కాయి. త్వరలో మరిన్ని కొత్త బస్సులు రానుండడంతో వాటిని ప్రయాణికుల ట్రాఫిక్ ఎక్కువగా ప్రాంతాల్లో నడిపించాలని సూచించారు.  ఇప్పటికే ఆర్టీసీ లో 1000 ఆర్టీసీ డ్రైవర్లు ,743 శ్రామిక్ పోస్టులకు  నోటిఫికేషన్ ఇచ్చి పోలీస్ రిక్యూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న  ఇంటర్వ్యూ దశలో ఉండడంతో నియామకాలు  వేగంగా పారదర్శకంగా జరిగేలా పూర్తి చేయాలని తెలిపారు. 

వచ్చే డిసెంబర్ చివరిలోపు 84 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ,114 సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియామక ప్రక్రియ టీజీపీఎస్సీ లేదా పోలీస్ బోర్డు ద్వారా నియమించేలా చర్యలు తీసుకోవాలన్నారు.