హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో నీళ్లు బంద్.. నీళ్లు ఉన్నాయో.. లేవో చూస్కోండి !

హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో నీళ్లు బంద్.. నీళ్లు ఉన్నాయో.. లేవో చూస్కోండి !

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వాటర్ బోర్డు తెలిపింది. కోదండాపూర్‌ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో విద్యుత్ అంతరాయం కారణంగా పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు భారీ లీకేజీ కావడం వల్ల జలమండలి అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. దీని వల్ల కృష్ణా ఫేజ్–II నుంచి హైదరాబాద్కు వచ్చే మంచినీటి సరఫరాపై ప్రభావం పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు.

నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు

వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలీనగర్, నాగోల్, బడంగ్‌పేట్, లెనిన్ నగర్, బాలాపూర్ రిజర్వాయర్, బర్కాస్, మైసారం, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్, మారేడ్ పల్లి, ప్రకాశ్‌నగర్, పాటిగడ్డ, మేకలమండి, మహేంద్ర హిల్స్, మేకలమండి, కంటోన్మెంట్, హష్మత్ పేట్, బాలానగర్.