Adah Sharma: దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు.. హీరోయిన్ అదా శర్మ సంచ‌ల‌న కామెంట్స్

Adah Sharma: దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు.. హీరోయిన్ అదా శర్మ సంచ‌ల‌న కామెంట్స్

పలు చిత్రాల్లో హీరోయిన్‌‌గా గ్లామర్ రోల్స్‌‌తో ఆకట్టుకున్న అదా శర్మ (Adah Sharma)..  ‘ది కేరళ స్టోరీ’, ‘బస్తర్’ సినిమాలతో పాన్ ఇండియా వైడ్‌‌గా గుర్తింపును తెచ్చుకుంది. దేశవ్యాప్తంగా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన "ది కేరళ స్టోరీ" 2023 మే 5న విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర మంచి వసూళ్లను రాబట్టింది. అంతేస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.

ఈ సినిమాలో షాలినీ ఉన్నికృష్ణన్‌ పాత్రలో నటించిన ఆదా శర్మ చక్కని నటన కనబరిచి శబాష్ అనిపించుకుంది. ప్రస్తుతం అదా శర్మ నటించిన అప్ కమింగ్ రిలీజ్ లీగల్ థ్రిల్లర్ సిరీస్ మూవీ 'రీతా సన్యాల్ సీజన్ 2'. రేపు శుక్రవారం (నవంబర్ 14న) డిస్నీ+హాట్ స్టార్లో స్ట్రీమింగ్కి రానుంది. ఈ సందర్భంగా అదాశర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది.

‘‘ లైఫ్లో రిస్క్‌ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్‌కు బాగుంటుంది. అపుడే జీవితంపై మరింత విలువ పెరుగుతుంది. తన ఫస్ట్ ఫిల్మ్ ‘1920’ హారర్ క్రైమ్ తోనే రిస్క్ చేయడం స్టార్ట్ చేశాను. ‘ది కేరళ స్టోరీస్’ విడుదలయ్యే వరకు నాకు మంచి పాత్ర, స్క్రిప్ట్ ఎప్పుడు దొరుకుతుందా అని వెయిట్ చేశా. ఈ సినిమా చేసిన తర్వాత నా లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో వచ్చిన పాపులారిటీతోనే ‘బస్తర్: ది నక్సల్’ స్టోరీ చేశాను. ఈ మూవీ కూడా నాపై అంతే ప్రభావం చూపింది.

అయితే, ఈ రెండు సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం నాకు తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. నిజానికి దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపించారు. వారంతా నన్ను రక్షించారు’’ అని అదా శర్మ తెలిపింది. ప్రస్తుతం అదాశర్మ వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా..  నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అలాగే, సవాలుతో కూడిన పాత్రలు మాత్రమే చేయడానికి  ఇష్టపడతానని అదాశర్మ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది. ‘‘నటించే పాత్రలో భావోద్వేగం లేకపోతే నాకు నచ్చదు. యాక్షన్‌ సీన్స్ ఉండాలి. నేను చేసే పాత్రలో ఎమోషన్‌ టచ్‌ ఉండాలి. అది చూసి నా ఫ్యామిలీ సైతం ఆశ్చర్యపడాలి. అవన్నీ లేకపోతే ఇక ఆ పాత్ర చేయడం ఎందుకు అని నాకు అనిపిస్తుంది’’ అని అదా శర్మ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదాశర్మ చేతిలో ఒక ఇంటర్నేషనల్ ఫిలింతో పాటుగా రెండు హారర్ ప్రాజెక్స్ లైనప్లో ఉన్నాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adah Sharma (@adah_ki_adah)