childrens day special : ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పిల్లలకి టైం ఇవ్వండి.. ఎంత ఆనందంగా ఉంటారో?

childrens day special : ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పిల్లలకి టైం ఇవ్వండి..  ఎంత ఆనందంగా ఉంటారో?

ఒక్క గంట సేపు ఈ ఛాలెంజ్ ని స్వీకరించి చూడండి. పిల్లలు కేరింతలు కొడుతూ ఎంత ఆనందంగా ఉంటారో? మీరూ అంతకంటే ఎక్కువ ఆనందంతో ఉంటారు. ఇవన్నీ ఎవరికీ తెలియక కాదు. పెద్దల ప్రయారిటీ లిస్టులో పిల్లలు వెనక్కిపోవడమే అసలు సమస్య, ఈ సమస్య మీ ఇంట్లో ఉండేమో? చెక్ చేసుకోండని చెప్పేందుకే పేరెంట్స్ సర్కిల్' పేరుతో రియలైజ్ అయిన కొందరు తల్లిదండ్రులు పిలుపు నిస్తున్నరు. 'గాడ్జెట్స్ కి డిస్ కనెక్ట్ చేద్దాం. పిల్లలతో కనెక్టవుదాం' అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఓ గంటపాటు స్విచ్చాఫ్ చేసేద్దాం.....

ఇంట్లో అందరూ ఉంటారు. కానీ ఎవరూ లేనట్టే ఫీలవు తుంటారు.పిల్లలు, పేరెంట్స్ వాట్సాప్ బిజినెస్ యాక్టివిటీస్లో బిజీగా ఉంటారు. సోషల్ స్టేటస్ కోసం సోషల్ మీడియాలో పోస్టు, లైడ్లు, కామెంట్స్ తో బిజీనెస్ని కొనితెచ్చుకుంటారు.. 'మమ్మీ, డాడీ" అంటూ పిల్లలు దగ్గరికొస్తే చేతిలోని గాడ్జెట్ పక్కన పెట్టి పిల్లల్నిచేతుల్లోకి తీసుకోవడం తగ్గిపోతోంది. కొన్ని ఇళ్లలో బిజీగా ఉన్నప్పుడు పిల్లలు ఇబ్బంది పెడుతున్నారని వాళ్ల చేతికి ఓ గాడ్జెట్ ని పెద్దలే అంటగడుతున్నారు. అవసరానికి మించి గాడ్జెట్స్ వినియోగం మంచిది కాదని పెద్దలకు చెబుతుంటే, ఆ పెద్దలే అవసరం లేని వాటిని పిల్లలకు అంటగడుతున్నారు. అమ్మానాన్నల్లాగే పిల్లలూ. ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లతో యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్లో సినిమాలు, సిరీస్లు చూస్తున్నారు. అదే వాళ్ల ప్రపంచం. సినిమాలే అశలు. సిరీస్లో వాళ్ల ఆలోచనలు. ఇది పిల్లల కంటి చూపు, శారీరక ఎదుగుదలపైనేకాదు.. మానసిక ఎదుగుదలపైనా చెడు ప్రభావం చూపుతుందని తెలుసు. అయినా 'ఈ ఒక్క రోజ్' అనుకుంటూ రోజూ పిల్లల్ని డీల్ చేస్తున్నారు. పేరెంట్స్, 'ఈ తప్పుని సరిదిద్దుకోకుంటే రేపటి 'ముప్పు మనదే' అని గుర్తించిన కొంత మంది పేరెంట్స్ కనువిప్పుతో వినిపించే కొత్త స్లోగనే ఈ గాడ్జెట్ ఫ్రీ అవర్. ఈ రోజు రాత్రి 7:30 గంటల నుంచి 8:30 గంటల మధ్య ఫోన్ల ని స్విచాఫ్ చేసి, కంప్యూటర్లని పక్కకు పెట్టి పిల్లలతో ప్రేమగా ఆడుకుండామంటున్నారు. వాళ్లకు ప్రపంచం నేర్పాల్సిన బాధ్యత మన చేతుల్లోకి తీసుకుందామంటున్నారు.

అమెరికాలో గాడ్జెట్స్ వాడకం ఎక్కువ. దీని వల్ల ఉండే ఇబ్బందుల గురించి అందరికీ తెలిసేలా చేయాలని, వాటిని తగ్గించుకోవడం. అలవాటు చేయాలని 'గాడ్జెట్ ఫ్రీ డేస్ ని జరుపుకుంటారు. ఇప్పుడు మనం కూడా గాడ్జెట్స్ కి ఎడిక్ట్ అవుతున్నం. కాబట్టి, వాటి నుంచి బయటపడాలని ఈ ఆలోచన చేస్తున్నరు. ఈ గంటలో మీరు పిల్లలతో కనెక్ట్ అయితే ఆ ఆనందం నుంచి మళ్లీ డిస్ కనెక్ట్ కాలేదని చెబుతున్నారు. అంటే అన్ని రోజులూ ఇలాగే ఉంటారని, ఉండాలన్నదే వాళ్ల రిక్వెస్ట్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి, కోల్కతా.. మొదలైన సిటీస్ గాడ్జెట్ ఫ్రీ అవర్ పై రియాక్ట్ అవుతున్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి రోజూ 'గాడ్జెట్ ఫ్రీ అవర్" చేసుకోవాలని కోరుతున్నారు.

స్కూలికిపోయి పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయి, స్నాక్స్ తీసుకున్న తర్వాత రోజూ స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు, వీడియో గేమ్ తో టైమ్పన్ చేయకుండా కాసేపు మీతో వాళ్లు, వాళ్లతో మీరూ ఎంజాయ్ చేయమని పేరెంట్స్ కి చెబుతున్నది పేరెంట్స్ సర్కిల్, 'నవంబరు 14' పిల్లల దినోత్సవం సందర్భంగా ఈ విషయం గురించి పేరెంట్స్ అందరూ రియలైజ్ కావాలని 'గాడ్జెట్ ఫ్రీ అవర్' కి సోషల్ మీడియాలో పిలుపునిచ్చింది. రియల్ లైఫ్ బాండ్ ని ఎంజాయ్ చేయాలని సిటీల్లో కొత్త పిలుపు వినిపిస్తోంది.

తారాల  సపోర్ట్: గాడ్జెట్ ఫ్రీ అవర్ కి సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు స్పందిస్తున్నారు. సినిమా తారలు మంచు లక్ష్మి, సమీరా రెడ్డి, భూమికా చావ్లా ఈ పిలుపు అందుకుని ఈ రోజు కచ్చితంగా గాడ్జెట్లను పక్కన పెట్టి పిల్లలకు గోరు ముద్దలు తినిపిస్తూ. ఆడిస్తూ, కథలు చెబుతూ నిద్రపుచ్చుతామంటున్నారు.