ఏపీ తరహాలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థపై అధ్యయనం : కోదండరెడ్డి

ఏపీ తరహాలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థపై అధ్యయనం  :  కోదండరెడ్డి

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తమ పార్టీ​నెరవేరుస్తోందని కాంగ్రెస్​ కిసాన్​ సెల్​జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి స్పష్టంచేశారు. ధరణి పై లోతుగా దర్యాప్తు జరగుతుందని శనివారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు దావోస్ పర్యటనలో కాకి లెక్కలు చెప్పేవారని విమర్శించారు. విధ్వంసం అయిన వ్యవస్థ ను చక్కబెట్టడానికి కొత్త ప్రభుత్వానికి కనీసం ఏడాదైనా సమయం ఇవ్వరా ప్రశ్నించారు.

 బీఆర్ఎస్ నేతలు ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ బాగుందని.. ఆ తరహా రిజిస్ట్రేషన్ల పక్రియ తెలంగాణలోనూ తీసుకువస్తే ఎలా ఉంటుందన్న దానిపై అధ్యయనం చేస్తామని, ధరణి పై త్వరలో మధ్యంతర నివేదిక ఇస్తామన్నారు.  మొత్తం నివేదిక వచ్చేసరికి మూడు నెలల టైమ్ పడుతుందని చెప్పారు.