సిటీలో వాహనాల లెక్క తేలుస్తరు! 

సిటీలో వాహనాల లెక్క తేలుస్తరు! 

ప్రజా రవాణ వ్యవస్థల అభివృద్ధికి అనువుగా స్టడీ
30 ఏళ్ల భవిష్యత్​ అవసరాలకు రూపొందించనున్న నివేదికలు 
మెట్రో సిటీల తరహాలో ట్రాఫిక్​ చెక్​ పెట్టేలా చర్యలు

హైదరాబాద్, వెలుగు: సిటీలో రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలతో పాటు ట్రాఫిక్​ కష్టాలు కూడా ఎక్కువవుతున్నాయి. భవిష్యత్​లో ప్రజా రవాణా వ్యవస్థల అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలను పక్కాగా తెలుసుకునేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక దృష్టి సారించింది.  యూనిఫైడ్​  మెట్రోపాలిటన్  ట్రాన్స్ పోర్టు అథారిటీ ( యూఎంటీఏ ‌‌– ఉమ్టా ) ఆధ్వర్యంలో  సర్వేకు సిద్ధమైంది. రెండేళ్ల పాటు చేసే సర్వేలో వివిధ అంశాలపై సమాచారం సేకరించనుంది. ఆ వివరాల ఆధారంగా ప్రజా రవాణ పెంపు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్ల విస్తరణ, వాహనాల రద్దీ నియంత్రణకు సంబంధించిన నివేదికలను రూపొందించనుంది. ఇప్పటికే సర్వే ఏజెన్సీల ఎంపికకు హెచ్ఎండీఏ టెండర్లు పిలవగా, ఈనెల12వ తేదీతో గడువు ముగియనుంది. టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీలు వెంటనే పనులు మొదలుపెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 
అంచనాల కంటే వేగంగా..
గ్రేటర్​సిటీలో రవాణా వ్యవస్థ ఎంతో కీలకం. ఇప్పటికే అంచనాల కంటే వేగంగా అభివృద్ధి చెందుతుండగా ట్రాన్స్​పోర్ట్​పై అధిక ఒత్తిడి పడుతోంది. సొంత వాహనాల వాడకం పెరుగుతోంది. తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు అధికమవుతున్నాయి. రోడ్డుపై కి వస్తే చాలు గంటల తరబడి ప్రయాణ సమయం పడుతోంది.  మెట్రోపాలిటన్ సిటీలకు మాదిరిగా ట్రాఫిక్ రద్దీ ఉంటోంది. ఢిల్లీ, కొల్​కతా, ముంబై తరహాలో ట్రాఫిక్ చిక్కులు లేకుండా సిటీ ట్రాన్స్ పోర్టును మెరుగుపరిచేలా సర్వేకు హెచ్ఎండీఏ  నిర్ణయించి  అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది.  ఇప్పటికే ఉన్న కాంప్రహెన్సివ్ ట్రాన్స్ పోర్టు రిపోర్ట్​ను కూడా అప్ గ్రేడ్  చేసేందుకు ఈ సర్వే ద్వారా మరింత సులభమవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. 
భవిష్యత్​ రవాణ అవసరాలపై..
ఇంటింటి సర్వే, రోడ్, జంక్షన్లలో వాహనాదారుల సర్వే, శాంపిల్ మార్గాల్లో వాహనాల రద్దీ, రోడ్డెక్కుతున్న రోజువారీ వెహికల్స్​ సంఖ్య, ఆయా మార్గాల్లో ట్రాఫిక్ లోడ్ వంటి వాటిపై స్టడీ చేయనుంది. తద్వారా రోడ్ల విస్తరణ, ట్రాఫిక్  డైవర్షన్,  వాహ నాల రద్దీ తగ్గించేలా  ఆల్ట్రనేటివ్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థల ఇంటిగ్రేషన్, రవాణ అవసరాలపై సర్వే ద్వారా సమాచారం సేకరించనుంది. భవిష్యత్​లో చేపట్టబోయే ట్రాన్స్ పోర్టు ప్రాజెక్టులకు ఈ సర్వే ఎంతగానో సాయపడుతుందని  ఉమ్టా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతమున్న ఎంఎంటీఎస్, ఆర్టీసీ, మెట్రో విస్తరణ అవసరాన్ని మరింత పక్కాగా స్టడీ చేసే వీలుందని అంటున్నాయి.  

రెండేళ్ల పాటు స్టడీ
2031 సంవతర్సం లక్ష్యంగా ఇప్పటికే కాం ప్రహెన్సివ్ ట్రాన్స్ పోర్టు స్టడీ జరిగింది.  2011లో సమగ్ర నివేదికను హెచ్​ఎండీఏ రూపొందించింది. దీని ఆధారంగానే మె ట్రో నిర్మాణం, బీఆర్టీఎస్ సేవలు, సైక్లింగ్ ట్రాక్​ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నా యి. అది కొత్త ట్రాఫిక్ సర్వేతో మరింత అప్ గ్రేడ్ అవుతుంది. తద్వారా వెహికల్ లోడ్, ట్రాఫిక్ ఇబ్బందులపై పక్కా సమాచారం ఉంటుందని అధికారులు అంటున్నారు.  మరో 30 ఏళ్ల వరకు సిటీకి  అవసరమైన రవాణ వ్యవస్థపై స్టడీ జరగ నుంది. వీడి యోల రూపంలో, ఆటోమెటిక్ ట్రాఫిక్ కౌం టర్ కం క్లాసిఫైర్ విధానంలో వెహికల్ ఆక్యుపెన్సీ, పార్కింగ్ డిమాండ్ వంటి అం శాలపై రెండేళ్ల పాటు స్టడీ చేయనున్నట్లుగా హెచ్ఎండీఏ వర్గాలు పేర్కొన్నాయి.